నేడు నాగుల పంచమి,ప్రకృతి పరిరక్షణ లో వాటి పాత్ర అమోఘం…

నేడు నాగుల పంచమి,ప్రకృతి పరిరక్షణ లో వాటి పాత్ర అమోఘం…

కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 28,(అఖండ భూమి న్యూస్);

ప్రకృతి లోని పరమార్థం నాగులపంచమి భారతీయ సంస్కృతిలో ముఖ్యంగాహైంద వసంస్కృతిలోచరాచరసృష్టిలో ని ప్రతి జీవి తన మునగడ అస్తిత్వం కోసం ప్రయత్నిస్తా యి. పర్యావరణ సమతుల్య త లో విషపు జంతువులు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నాగుల పంచమి అనేది జులై ఆగస్టు నెలలో వచ్చే శ్రావణమాసంలోని శుక్ల పంచమి రోజు వస్తుంది. నాగు ల పంచమి పండుగ భక్తి ,వంశ పరిరక్షణ, పర్యావరణం పట్ల కృతజ్ఞత వంటి అనేక భావాల తో నిండి ఉంది. నాగపంచమి రోజు స్త్రీలు ప్రత్యేకంగా తయా రై ఆవుపాలు జొన్న పేలాలు శనిగలు తమకు సమీపంలోని పుట్టవద్దకువెళ్లిపోసినాగమయ్య నా పాలు నాగమయ్య నీ పాలు నాగమయ్య మా అంద రి పాలు అంటూ మమ్ములను రక్షించు పొరపాటున కూడా కాటేయకు అంటూ ప్రార్థిస్తారు.కొందరు మట్టితోనే పుట్ట తయారు చేసుకొని పూజలునిర్వహించుకుంటారు.కొన్ని కుటుంబాలలో పాలతో కళ్ళు కడిగే సంప్రదాయం ఉంది. ఆరోజు స్త్రీలు ఉపవా సం ఉండి ఉపవాస నుండి ప్రత్యేకనోములుకూడాచేసుకుం టారు. నాగుల్ని పూజించే పండగ భారతదేశంలోని చా లా ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు .సర్ప దోష నివారణ కోసం సంతానం కోసం ఈ పండుగ చేసుకుంటా రు. కుళక కర్ణుడు రావు కేతు దోషాలు కుజదోషం వంటి దోషాలు, జాతక సమస్యల నివారణకు ఈ దినం శుభ దినం గా భావిస్తారు శ్రీకృష్ణుడు కలియ మర్దన చేసిన కథను గుర్తు చేస్తూ ఆయన విజయా నికి సోపానంగా కూడా జరుపు తారు. శేషనాగుని వాసుకుని పూజించడం ద్వారా విష్ణువు శివుడి వంటి దేవతల అనుగ్ర హం లభిస్తుందని నమ్మకం ప్రకృతి పరిరక్షించే సందేశం వ్యవసాయంలో పంటలను నాశనం చేసే క్రిములు కీటకాల ను ఎలుకలనుతినివ్యవసాయ దారునికి మేలుచేస్తాయి.సర్పా లు మనుషులు జంతువులు సమంగాజీవించాలని క్రూరత్వవం వదిలి సర్పాలను దయతో చూడాలని ఈ పం డుగ బోధిస్తుంది.ఇంకో విష యం పాములు పాలు తగావు, పంచామృతలతో మాత్రమే పూజా చేయండి.మన మూఢ

భక్తి మూగ జీవలకు ఇబ్బంది కలగకూడదు.

Akhand Bhoomi News

error: Content is protected !!