ఆసుపత్రి పరిధిలో ఆరోగ్యకరమాలు పకడ్బందీగా నిర్వహించాలి…

ఆసుపత్రి పరిధిలో ఆరోగ్యకరమాలు పకడ్బందీగా నిర్వహించాలి…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 29 (అఖండ భూమి న్యూస్);

ఆసుపత్రి పరిధిలో ఆరోగ్య కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

మంగళవారం భిక్కనూరు మండలం జంగంపల్లి పల్లె దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపి, ఏఎన్సి చెకప్, తదితర వివరాలను వాకబు చేశారు. ఆసుపత్రి పరిధిలో తరచు ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఎక్కడైనా డెంగ్యూ వంటి వ్యాధులు నిర్ధారణ అయితే వెంటనే వైద్యులను అప్రమత్తం చేసి మెడికల్ క్యాంపులను నిర్వహించాలని ఆదేశించారు. ఆశాల ద్వారా ఏఎన్సి చెకప్, సామ్/మామ్ పిల్లల ఆరోగ్య సంరక్షసక్రమంగా ఉండాలని, మండలంలో ఎక్కడ నీరు నిలువ కాకుండా చూసుకోవాలని, శానిటేషన్ పనులు సక్రమంగా జరగాలని ఆదేశించారు. ఆసుపత్రిలో నిర్వహించే రోజువారీ కార్యక్రమాలను రిజిస్టర్లలో నమోదు చేయడంతోపాటు వాటిని ధృవీకరించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం కాకుండా చూడాలని, ఇసుక, మొరం కొరకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, డిప్యూటీ విద్యాధికారి ప్రభుకిరణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!