పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి.. బొమ్మన దశరథ రామ్ రెడ్డి

పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి.. బొమ్మన దశరథ రామ్ రెడ్డి

 

కర్నూలు రూరల్ వెల్దుర్తి (అఖండ భూమి) : పేద ప్రజల అభ్యున్నతి కొరకు తమ వంతు సహకారం అందిస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నామని మాజీ ఎంపీపీ బొమ్మన దశరథరామిరెడ్డి అన్నారు. వెల్దుర్తి పట్టణంలోని 4వా వార్డులో ఉన్నటువంటి ఎబియం ఏడెడ్ పాఠశాలను దాత బొమ్మన దశరథ రామిరెడ్డి మంగళవారం పరిశీలించారు. విద్యార్థులతో కొంత సమయం వారితో ముచ్చటించడం జరిగింది. అనంతరం పాఠశాలకు కావలసిన వసతుల గురించి ఆలోచించడం జరిగింది. దింతో పాఠశాలకు కావలసిన మౌలిక వసతులు మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పిస్తానని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూతమ్మతో చర్చించారు. పాఠశాల సౌకర్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో వివిధ రకాల సుమారు 70 మొక్కలు దాకా స్వయంగా నాటడం జరిగింది. ఈ పాఠశాల కొరకే ఆయన 30 సెంట్ల స్థలం విరాళంగా ఇచ్చిన సంగతి పాటకులకు విధితమే. తాత్కాలికంగా పాఠశాలను రేకుల షెడ్డుతో నిర్మించి, పేద విద్యార్థుల కొరకై ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి పేద ప్రజలకు అంకితం చేస్తామని ఆయన గ్రామస్తులకు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!