ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం… బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు. 

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం… బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు.

వెల్దుర్తి జులై 29 (అఖండ భూమి) : ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ టిడిపి నాయకులు ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్, టిడిపి మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్ లు అన్నారు. వెల్దుర్తి మండల కేంద్రం నందు మంగళవారం సుపరిపాలన ప్రభుత్వ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా 14, 15 వార్డులలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన అభివృద్ధి టిడిపి ప్రభుత్వం వచ్చాక ఒక సంవత్సరంలోనే ఐదు సంవత్సరాలలో జరిగిన అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఘనత టిడిపి పార్టీకే దక్కుతుందని అన్నారు. తల్లికి వందనం, గ్యాస్ పథకం, పెన్షన్ పథకాలు ఎంతో వైభవంగా ప్రజల చెంతకు చేరుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!