శ్రీశైలంలో డ్రైవర్లు భక్తులతో మర్యాదగా మెలగాలి 

శ్రీశైలంలో డ్రైవర్లు భక్తులతో మర్యాదగా మెలగాలి

శ్రీశైలం అఖండ భూమి న్యూస్, 29 జూన్

శ్రీశైలం సీఐ,జి.ప్రసాదరావు తమ సిబ్బంది రఘునాథుడు, బాలకృష్ణ, అమర్నాథరెడ్డి, వెంకట్ నారాయణ, నాను నాయక్ సహేతంగా శ్రీశైలం లో గల జీప్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు యజమానులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ  సమావేశానికి ముఖ్యఅతిథిగా  శ్రీశైలం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

శ్రీశైలం సి ఐ జి ప్రసాదరావు మాట్లాడుతూ

వాహన రికార్డులు ఆర్ సి, డ్రైవింగ్ లైసెన్స్, బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, కాలుష్య ధృవీకరణ పత్రాలు ఉండాలి

యాత్రికుల పట్ల మంచి ప్రవర్తన తో నడుచుకోవాలి

తాగి వాహనం నడపకూడదు

అతి వేగంగా వాహనాన్ని నడపరాదు

ఓవర్ లోడ్ ఎక్కిoచరాదు

సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదుమోటార్ సైకిల్ నడిపేవారు,హెల్మెట్ ధరించడం

కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ ధరించడం

యాత్రికుల నుండి అదనపు ఛార్జీలు డిమాండ్ చేయవద్దు

వాహన బీమా యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.

అన్ని రికార్డులు సక్రమంగా ఉన్న వాహనదారులకు పోలీస్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది

ఆటో డ్రైవర్ల మరియు యజమానుల డేటా బేస్ మెయింటిను,చేయడంజరుగుతుంది

శ్రీశైలం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి,శ్రీనివాసరావు మాట్లాడుతూ జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన శ్రీశైల మహా పుణ్యక్షేత్రానికి భారతదేశo అన్ని ప్రాంతాల నుండి భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి వారితో మర్యాదగా నడుచుకోవాలి.అదేవిధంగా శ్రీశైల దేవస్థానం యొక్క ప్రతిష్టకు,ప్రాముఖ్యతకు భంగం కలిగించరాదు. అవాస్తవాలు అసత్యాలను ఎవరైనా సోషల్ మీడియాలో దురుద్దేశంతో ప్రచారం చేయకూడదు. ఎవరైనా దేవస్థానం పరంగా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వారి పైన కఠినమైనచర్యలు తీసుకోబడతాయి అని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు శ్రీశైలం,సీఐ జి,వరప్రసాద రావు వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!