అప్గ్రేడ్ చేసిన పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేయాలి
– పి.ఆర్.టి.యు ఆధ్వర్యంలో డీఈవోకు వినతిపత్రం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు, జీఈసీఓ సుకన్యకు పి.ఆర్.టి.యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం నేతృత్వంలో డీఈవోను కలిసి ఉపాధ్యాయులు పడుతున్న పలు ఇబ్బందులపై తెలియజేయడం జరిగిందన్నారు. ఆ వినతిలో ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు. అప్గ్రేడ్ చేసిన పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్ల ద్వారానే భర్తీ చేయాలని, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేజీబీవీల్లో నైట్ డ్యూటీ చేసిన మహిళా ఉపాధ్యాయినీలకు ఉదయం పూట పనివేళ మినహాయింపు ఇవ్వాలని కోరారు. కుటుంబాలకు దూరంగా, ఎక్కువసేపు విధుల్లో నిమగ్నమవుతున్న నేపథ్యంలో మానవతా దృష్టితో ఈ నిర్ణయం అవసరమని పి.ఆర్.టి.యు, నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సంజీవులు సహా పలువురు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…