జాతీయ ఓబీసీ మహాసభ గోడప్రతుల ఆవిష్కరణ…
సాప శివరాములు,నీల నాగరాజు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 30 (అఖండ భూమి న్యూస్);
జిల్లా కేంద్రంలోని ఆర్&బీ అతిథి గృహంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో గోడప్రతుల ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం జిల్లా అధ్యక్షులు శివరాములు,నాగరాజు లు మాట్లాడుతూ వచ్చే నెల ఆగస్ట్ 7న గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.దేశంలో మొదటిసారి మండల కమీషన్ సిఫార్సులైనా ఓబీసీలకు ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ సింగ్ ప్రకటించిన ఆగస్ట్ 7 రోజున ప్రతీ సంవత్సరం దేశంలోని అన్ని బీసీ ఉద్యమ శక్తులను కలుపుకొని జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.10వ సారి జరిగే ఈ జాతీయ ఓబీసీ మహాసభకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి పది వేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారన్నారని,ఈ సభకు దేశంలోని అఖిల పక్ష రాజకీయ పార్టీల నేతలను,ఓబీసీ జాతీయ నాయకులకు ఆహ్వానం అందినట్లు తెలిపారు.ఉదయం 10 గంటలకు గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ మహాసభకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభలో జాతీయ స్థాయిలో ఓబీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాములు,నీల నాగరాజు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు, అబ్రబోయిన రాజేందర్ దోమకొండ మండల అధ్యక్షులు,పున్న లక్ష్మణ్,సిద్ధరాములు,యాదగిరి,కొత్తపల్లి మల్లన్న,గోవర్ధన్,అజీజ్ తదితరులు పాల్గొన్నారు.