హైకోర్టు ఆదేశాల తర్వాత అమరావతిలోని R5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పనులు వేగవంతం చేసింది ప్రభుత్వం..
మొత్తం 11వందల 34 ఎకరాలను ఈ జోన్ కోసం కేటాయించారు. వీటిల్లోనే పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తారు. ఒకవైపు లేఅవుట్ పనులు శరవేగంగా జరుగుతుంటే.. ఇంకోవైపు స్థానికుల నుంచి నిరసనలు తప్పడం లేదు..
మంగళగిరి మండలం కురగల్లులో R5 జోన్ హద్దురాళ్లను స్థానికులు తొలగించారు. నిన్న కురగల్లుతోపాటు.. నవులూరు, యర్రబాలెం, నిడమర్రు, కృష్ణాయపాలెంలో అధికారులు పర్యటించి.. అక్కడ భూమిని చదును చేశారు. హద్దురాళ్లు పాతారు. త్వరలోనే CRDA పరిధిలో కేటాయించిన ఈ భూముల్లో గుంటూరు, విజయవాడ పరిధిలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే కురగల్లులో హద్దురాళ్లు తొలగించడంతో కలకలం రేగుతోంది..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



