మంగళగిరిలో శాఖ గ్రంథాలయంకు స్థానిక ఏపీఎస్పీ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన హైకోర్టు ఏజీపీ అప్పల షణ్ముఖరెడ్డి మంగళవారం న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించే పుస్తకాలు, నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్ మీడియంలకు చెందిన 76 పుస్తకాలను ఉచితంగా అందజేశారు. లైబ్రరీయన్ శ్రీమతి ఆరోగ్యంకు పుస్తకాలను షణ్ముఖరెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు న్యాయవ్యవస్థపై, చట్టాలపై అవగాహన కలగాలని ఉద్దేశంతో పుస్తకాల అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే పేద, మధ్యతరగతి నిరుద్యోగులు, విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందజేయడం జరిగిందన్నారు. ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఉపయోగించుకొని మంచి విజ్ఞానాన్ని పొందాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు అందజేయడానికి తమ వంతు కృషి చేస్తానని షణ్ముఖరెడ్డి అన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


