పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
-టియుసిఐ రాష్ట్ర నాయకులు రమేష్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి;జులై 30, (అఖండ భూమి న్యూస్);
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 ఇవ్వాలని కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రెగ్యులర్ చేయాలని పెన్షన్ 9000 రూపాయలు ఇవ్వాలని 12 గంటలుపని వ్యతిరేకించాలని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామపంచాయతీ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేస్తూ టియుసిఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, జూలై 30న కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా (టి యుసిఐ) నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సముక్త జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ ,
మాట్లాడుతూదశాబ్దాలుగా కనీస వేతనాలు లేకుండా అత్యధిక పని గంటలకు కార్మికులుశ్రమదోపిడికి గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నాడు కార్మికుల సంక్షేమ బోర్డు చేస్తానని హామీ ఇచ్చిందని హామీ దృష్ట్యా కార్మికుల అందరిని రెగ్యులర్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పని భద్రతతో కూడిన సమగ్ర చట్టం ఈఎస్ఐపిఎఫ్ హెల్త్ స్కీములు ప్రమాద బీమా లాంటి న్యాయ హక్కులు కూడా వారికి లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో కార్మికులందరూ సంఘటితమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏ ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి అనీష్, జిల్లా నాయకులు, రాజు, గోపాల్ మరియు గ్రామపంచాయతీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
కొత్త రేషన్ కార్డుదారులకు శుభవార్త.. త్వరలో వీరికి ఆరోగ్యశ్రీ …
-
మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిని పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
-
దంపతులు ఇరువురికి ప్రశంశ పత్రాలు…
-
అంగన్వాడి, రెసిడెన్షియల్ , సంక్షేమ హాస్టల్ లకు గుడ్ల సరఫరాకు టెండర్…
-
వన క్షేమమే మన క్షేమం – కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్…