స్పీడ్ పోస్టులో రిజిస్టర్డ్ పోస్టుల విలీనం…
సెప్టెంబరు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమలు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్డ్ పోస్టు విధానాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేయబోతోంది. ఈ విధానం సెప్టెంబరు ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారులకు అత్యంత వేగవంతమైన, మెరుగైన సేవల్ని అందించడం, ట్రాకింగ్ విధానాన్ని సులభతరం చేయడం, అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తేవాలని తపాలా శాఖ నిర్ణయించింది. ఆమేరకు దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్ల పరిధిలోని మెయిల్ ఆపరేషన్ డివిజన్లకు ఆదేశాలు అందాయి.