77 వ సారి రక్తదానం చేసిన డాక్టర్ బాలు..
రక్తదానం చేసే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ఈ రోజు 77 వ సారి రక్తదానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే తోటి వారి ప్రాణాలను కాపాడడం మాత్రమే కాకుండా రక్తదానం చేసిన వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం గుండె సంబంధిత,కొలెస్ట్రాల్,క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అన్నారు రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని రక్తదానం చేయడానికి ఇప్పటికీ సమాజంలో కొంతమంది వెనకడుగు వేస్తున్నారని రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,టెక్నీషియన్ ప్రమోద్ లు పాల్గొన్నారు.