సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి…

సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి…

 

జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు వట్టికూడి రామారావు గౌడ్..

కామారెడ్డి జిల్లా కేంద్రంలో జయంతి ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 1 (అఖండ భూమి న్యూస్);

ఆగస్టు10 తేదీన రవీంద్రభారతిలో జరిగే సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు వట్టికూడి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375 వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై గౌడ్ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధన కోసం ప్రతి గౌడబిడ్డ కృషి చేయాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలలో కామారెడ్డి జిల్లా నుండి అధిక సంఖ్యలో గౌడ సోదరులు హాజరై పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈపోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో జై గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బొంబోతుల లింగాగౌడ్, అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్,ఇందూరి సిద్ధా గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కర్రోళ్ల శేఖర్ గౌడ్, జై గౌడ ఉద్యమం మాచారెడ్డి మండల అధ్యక్షులు బొంబోతుల సురేష్ గౌడ్, తాటిపాముల ప్రశాంత్ గౌడ్, పల్లె దేవేందర్ గౌడ్, భూపతి గౌడ్ జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొనడం జరిగినది.

Akhand Bhoomi News

error: Content is protected !!