గొట్టిముక్కుల మున్నూరు కాపు సంఘం కమిటీ ఎన్నిక…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని గొట్టిముక్కుల గ్రామంలోని మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఆ సంఘ భవనంలో కుల సంఘ సభ్యులు ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా ముదాం శివశంకర్, ఉపాధ్యక్షులుగా ముదాం లింగం, ప్రధాన కార్యదర్శిగా ముదాం నాగయ్య, కోశాధికారిగా ఆకుల నర్సింలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ ఒక సంవత్సరం పాటు పనిచేస్తుందని సంఘ సభ్యులు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.