మంత్రి నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి 

మంత్రి నారా లోకేష్ ను కలిసిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి

 

ఉండవల్లి, శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 1, ఆగస్టు

ఉండవల్లిలో, శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిరాష్ట్ర విద్యా, ఐటీ, హెచ్.ఆర్.డి మరియు ఆర్.టి.జి శాఖల మంత్రి  నారా లోకేష్ ని అమరావతి ఉండవల్లి లోని వారి స్వగృహం నందు శుక్రవారం ఉదయం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా శ్రీశైలం మండలంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ బిసి హాస్టల్, పాలిటెక్నిక్,ఐ.టి.ఐ కళాశాలల నందు హాస్టల్ వసతి, భోజన శాల, తరగతి గదుల మరమ్మత్తులు, మౌలిక వసతుల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణం, త్రాగునీటి సదుపాయం ఏర్పాటికై వినతి..

అలాగే శ్రీశైలం నియోజవర్గంలో యువ గళం పాదయాత్ర సందర్భంగా లోకేష్  ఆనాడు ఇచ్చిన హామీ.. ప్రతి చెంచు కుటుంబానికి ఇళ్లు నిర్మించి అందించే అంశంపై కూడా ఎమ్మెల్యే  బుడ్డా రాజశేఖర రెడ్డి  మంత్రి  నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు.ఈ అంశాలపై మంత్రి శ్రీ లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే  వెంట శ్రీశైలనియోజకవర్గ టిడిపి నాయకులు యుగంధర్ రెడ్డి వీరితోపాటు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!