◾ ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకొని అనంతపురం జిల్లా పోలీసులు.
అర్థరాత్రి సమయంలో అనుమతి లేకుండా దేవుడు విగ్రహాలు ఇలా కూల్చడం పై పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ▪️అనంతపురం జిల్లా లో టవర్ క్లాక్ వద్ద ఉన్న వాసవీ ఆలయ ఆర్చ్ కూల్చివేత వివాదాస్పదమవుతోంది. ▪️సోమవారం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి సుమారు 11 గంటలకు జేసీబీ లతో ఆర్చ్ ను రోడ్ విస్తరణలో భాగంగా కూల్చి వేశారు. ▪️కాకపోతే దేవతా విగ్రహాలను కూడా జేసీబీ లతో కూల్చి నందుకు విగ్రహాలు కింద పడి పగిలిపోవడం తో ప్రజలు ఆవేదనకు గురి అవుతున్నారు. ▪️దేవతా విగ్రహాలను మాత్రం తాళ్లతో కట్టి కిందకు దించలేదు అంటూ అనంతపురం జిల్లా వాసులు ఆందోళనా వ్యక్తం చేస్తున్నారు. ▪️ ఇదే రోడ్డు లో సప్తగిరి సర్కిల్ లో ఉన్న మజీద్ మాత్రం కోర్ట్ లో కుల్చకుండా ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నారు. ▪️ ఈ గుడి కూల్చివేత పై వైసీపీ మేయర్ మౌనంగా ఉండడం పలు వివాదాలకు దారి తీస్తాయి అంటూ అనంతపురం జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ▪️ దేవత విగ్రహాలు ఇలా కూల్చడం సరైన నిర్ణయం కాదు దీని పై మేయర్ మరియు జిల్లా ఎమ్మెల్యే స్పందించాలి అంటూ పలు సంఘాలు ప్రభుత్వం పై మండిపడుతున్నాయి. ▪️వెంటనే ప్రభుత్వ అధికారులు పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


