తెలంగాణ రాష్ట్రాన్ని తన మేథో శక్తితో సాధించిన గొప్ప వ్యక్తి ప్రో.జయశంకర్… _
తెలంగాణ యూనివర్సిటీ సౌఖ్యాంపస్ డా.సుధాకర్ గౌడ్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 6 ( అఖండ భూమి న్యూస్);
తెలంగాణ జాతిపిత ప్రో.జయశంకర్ తన మేథో శక్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కలను నిజం చేసేలా చేశారని సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ అన్నారు. బుధవారం ఆగస్టు 6 ప్రో.జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.
తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుకొని మలి దశ పోరాటం ,రాష్ట్ర ఏర్పాటు వరకు ఆయన చేసిన మేధో కృషి ఎనలేనిది అన్నారు. నీళ్లు ,నిధులు,నియామకాల్లో తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని పూసగుచ్చినట్టు,లెక్కలతో సహా వివరించి ఉద్యమానికి ఊపిరి పోశారని కొనియాడారు.ఆయన జీవితకాల కృషి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. నేడు రాష్ట్రం సిద్ధించిన పరిస్థితుల్లో ఆయన మనకు భౌతికంగా లేకపోవటం లోటని అన్నారు. ఇప్పటి సమస్యలకు కూడా సరైన సలహాలు సూచనలతో పరిష్కారం చెప్పేవారేమో అన్నారు. మనం రాష్ట్రం సాధించుకున్నాం ఆ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా అభివృద్ధి చేసుకొనే లక్ష్యం మిగిలే ఉందని అన్నారు. ఆ లక్ష్య సాధనలో ప్రో.జయశంకర్ గారు చూపిన బాట అందరికీ ఆదర్శం అన్నారు. ఆయన బాటలో నడవటం ఆయనకిచ్చే ఘన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లు డా.సునీత,డా.యాలాద్రి, అధ్యాపకులు డా.హరిత,డా.ప్రతిజ్ఞ ,డా.నారాయణ, apro డా.సరిత పిట్ల విమెన్ సెల్ అసిస్టెంట్ డైరెక్టర్ వైశాలి,డా.నర్సయ్య,శ్రీకాంత్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.



