ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు

ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు

(అందోల్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )

జోగిపేట్ లో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగా సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 వేల కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, గురుకులాలకు సొంత భవనాలు లేవన్నారు. విద్యార్థులు అద్దె భవనాల్లో ఉంటూ చదువుకుంటూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. గురుకులల లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదన్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఫుట్ పాయిజన్ 48 మంది విద్యార్థులు రాష్ట్రంలో చనిపోవడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్య సంస్థలలో చదువుకునే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వ హాస్టల్స్ ల లో చదువుకునే విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ చార్జీలను పెంచాలి అన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్న కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ విద్య రంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్య సంస్థలకు కొమ్ము కాస్తుందన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ‌ ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు…

ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా కమిటీ సభ్యులు గొల్ల శంకర్. ఎస్ ఎఫ్ ఐ నాయకులు, సాయి తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!