నులి పురుగుల నివారణకు పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6)
ఈనెల 11న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా
1 నుంచి 19 ఏండ్ల లోపు పిల్లలందరికీ తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రాలు వేయించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహణ సందర్భంగా జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలు మొత్తం ఒక లక్ష 92,695 మందిని గుర్తించడం జరిగిందని వీరి కోసం 2,11964 మాత్రలు సిద్ధంగా సిద్ధంగా ఉన్నాయని ఇట్టి కార్యక్రమము ఆగస్టు 11 తేదీన అంగన్వాడి సెంటర్స్ ప్రభుత్వ పాఠశాలల్లో మొదలవుతుందని తెలిపారు. ఒకటి నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాలలో ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వబడతాయి అన్నారు .
ఒకటి నుండి 05 సంవత్సరాల పిల్లలు బడి బయట ఉన్న పిల్లలు కౌమార దశలో ఉన్నవారు ఆగస్టు 11వ తేదీన మీ సమీప అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి టాబ్లెట్లు తీసుకుని వైద్య సిబ్బంది సలహా మేరకు ముఖ్యమైన సూచనలు పాటించాలన్నారు. ఒకటి ,రెండు సంవత్సరాల పిల్లలు సగం టాబ్లెట్లు మాత్రమే సువర్ణం చేసి అందించాలని రెండు నుండి మూడు సంవత్సరాల వయసు గల పిల్లలకు పూర్తి మాత్రలు చూర్ణం చేసి పరిశుభ్రమైన నీటితో అందించాలన్నారు 03 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న పిల్లలు మాత్రలు నమిలి పరిశుభ్రమైన నీటితో మింగించాలన్నారు . ఇలా చేయడం వల్ల నులిపురుగులను సమూలంగా నిర్మూలించవచ్చు అన్నారు.
పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతపై చర్యలు తీసుకునేలా చూడాలన్నారు.
పాదరక్షకులు లేకుండా ఆడటం బహిరంగ మలవిసర్జన మురికి చేతులు ద్వారా నులిపురుగులు పిల్లలకు సోకుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు


