పర్యావరణ రహిత ఆకుపచ్చ తెలంగాణ నే మన అందరి కర్తవ్యం జిలా కలెక్టర్
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6 )
ప్రజలలో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం, చెట్ల ప్రాముఖ్యతను తెలియజేయడం.
నర్సాపూర్ ప్రభుత్వ కళాశాలలో 1,000 మొక్కలు నాటే లక్ష్యంగా సంరక్షణకు కృషి
కళాశాల విద్యార్థులు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు భాగస్వాములు కావాలి.
ప్రభుత్వ కళాశాలలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తీటుగా విద్యా ప్రమాణాలు.
నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, జిల్లా పరిషత్ హై స్కూల్ ఆకస్మిక తనిఖీ,
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నర్సాపూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన కలెక్టర్
పర్యావరణ రహిత ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దడమే మనందరి కర్తవ్యం అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
బుధవారం నర్సాపూర్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ముందుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి వనమహోత్సవం కార్యక్రమంలో
భాగంగా మొక్కలు నాటారు, అనంతరం
జిల్లా పరిష త్ హై స్కూల్ ను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు,
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ రహిత ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం
దృఢ సంకల్పంతో ముందుకు పోతుందని నర్సాపూర్ ప్రభుత్వ కళాశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 1000 మొక్కలు నాటడం జరిగిందని ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి వాటి సంరక్షణకు వారే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యార్థి దశ నుండే మొక్కలు నాటి వాటి సంరక్షణకు
చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేటి మొక్కలే రేపటి వృక్షాలు అవే మానవాళి మనుగడకు జీవనాధారాలుగా ఉంటాయని నాటిన మొక్కలను సంరక్షించి మానవాళికి ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచే బాధ్యత మనమందరం తీసుకుందామని తెలిపారు. మన సొంత పిల్లల మాదిరిగానే చెట్లను పెంచితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆకుపచ్చ తెలంగాణ అవుతుందన్నారు. మనం మొక్కలను జాగ్రత్తగా చూసుకుంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని తెలిపారు
కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడిందని అన్నారు. 100% ఉత్తీర్ణత లక్ష్యంగా కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత విద్యావంతులు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు.
అనంతరం కలెక్టర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ ను సందర్శించి తరగతి గదులలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యమైన మెనూ అందించడంలో రాజీ పడేది లేదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి,ఇంటర్మీడియట్ అధికారి మాధవి, సంబంధిత ప్రిన్సిపల్స్
ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు


