జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్: జయంతి ఘనంగా వేడుకలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 6)
కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ 91 వ జయంతి వేడుకలు
జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ అని , వారి సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ అన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 91 వ జయంతి పురస్కరించకుని వారి చిత్ర పటానికి కలెక్టర్ రాహుల్ రాజ్, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ నే ఆశ, శ్వాసగా జీవించి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పోరాడి మలి దశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్ మార్గదర్శనం గా నిలిచారన్నారు.
ఆచార్య జయశంకర్ మన మధ్య లేనప్పటికీ.. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు. ఆచార్యుని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భుజంగరావు, ఏవో యునస్ ,బీసీ సంక్షేమ అధికారి జగదీష్ , సహాయ అధికారి, గంగా కిషన్ . ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, వసతి గృహ సంక్షేమ అధికారులు, బీసీ సంఘం నాయకులు,కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


