చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటు అందిస్తుంది: అదనపు కలెక్టర్  

చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటు అందిస్తుంది: అదనపు కలెక్టర్

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 7 )

చేనేత కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాల తోడ్పాటు అందిస్తుంది: అదనపు కలెక్టర్ ( స్థానికసంస్థలు ) చంద్రశేఖర్.

జాతీయ చేనేత దినోత్సవం ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్  చేనేత కార్మికులు తమ వృత్తిలో అధునాతన పద్ధతులు అవలంబించాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేనేత వృత్తి మరింత అభివృద్ధి. చేనేత మహిళలు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలలో లబ్ధి పొందాలి. చేనేత కళాకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అదనపు కలెక్టర్ ( స్థానికసంస్థలు ) చంద్రశేఖర్ అన్నారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌలీ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఐటిఐ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ వృత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా చేనేత కల అంతరించిపోకుండా ఉంటుందన్నారు. చదువుకున్న యువకులు చేనేత వృత్తిలోకి వస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని సులువు అవడంతోపాటు అనేక నూతన రకాల ఉత్పత్తులు తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో 4 చేనేత సహకార సంఘాలలో 74 చేనేత మగ్గాలు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని నాణ్యమైన లుంగీలు, తువ్వాలలు, చేతి రుమాలు , మెరినో ఉన్ని బ్లాంకెట్ లు, మగ్గాలపై ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నేతన్న అభయహస్తం కార్యక్రమంలో భాగంగా రూ.168 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో చేనేత సహకార సంఘాలకు పావుల వడ్డీ రుణాలు కామన్ వర్క్ షెడ్ ఏర్పాటు , 40% రాయితీపై నూలు, క్యాష్ క్రెడిట్, లాంటి పథకాల ద్వారా చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నేతన్న పొదుపు పథకం లో చేనేత కార్మికులు ఎనిమిది శాతం డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం ఎనిమిది శాతం డబ్బులు జమ చేస్తుందన్నారు జిల్లాలో అర్హత కలిగిన 31 మంది చేనేత కార్మికులు ఈ పథకానికి అర్హత పొందినట్లు తెలిపారు.

నేతన్న భద్రతా పథకం ద్వారా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వల్ల చేనేత కార్మికులు మరియు మరమగాల కార్మికులు మరణించితే వారి నామినీకి జీవిత బీమా సంస్థ ద్వారా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకం లో 54 మంది చేనేత కార్మికులు అర్హత పొందినట్లు తెలిపారు.

నేతన్న భరోసా పథకం లో జియో ట్యాగింగ్ నెంబర్ కలిగిన చేనేత కార్మికులకు వారి నిలవారి ఉత్పత్తి సామర్ధ్యమును బట్టి సంవత్సరానికి 18000 మరియు అనుబంధ కార్మికులకు 6000 కార్మికుల ఖాతాలు జమ చేస్తున్నట్లు తెలిపారు ఈ పథకంలో జిల్లాలో 31 మంది చేనేత కార్మికులు నమోదైనట్లు తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకొని చేనేత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సూచించారు.

ఈ పథకాలతో పాటు చేనేత సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళలు డ్వాక్రా స్వయం సహాయక సంఘాల వలె సంఘాలుగా ఏర్పడి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి పొందవచ్చు అని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని తామ వృత్తిలో ఇంకా మెరుగైన పద్ధతులు ఏమేమి చేస్తే చేనేత రంగం అభివృద్ధి చెందుతుందో సమగ్రంగా నివేదిక సమర్పిస్తే జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆయా కార్యక్రమాలు అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ అధికారి వెంకట్రావు . హెచ్ డబ్ల్యు సి ఎస్ ప్రెసిడెంట్ వర్కల అశోక్, కృష్ణయ్య హెచ్ డబ్ల్యు సి ఎస్ డైరెక్టర్ వరలక్ష్మి, గిపేట నారాయణఖేడ్ చేనేత సహకార సంఘాల సభ్యులు సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!