రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి … జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 7)
సంగారెడ్డి జిల్లా పరిధిలో నిర్మించబోయే రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు. మొత్తం ఐదు ప్యాకేజీలుగా ఈ రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం సంగారెడ్డి జిల్లా పరిధిలో భూమిని సేకరించాలని నిర్ణయించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జిల్లా అధికారుల నుండి రీజినల్ రింగ్ రోడ్డు భూ సకరణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి, ఆందోల్ ఆర్డీవో పాండు, గజ్వేల్ మేనేజర్ నేషనల్ హైవే అథారిటీ మేనేజర్ శ్రీహరి, ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


