గూడెం ( అందోల్) గ్రామంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం
(అందోల్ మండల్ ప్రతినిధి

అఖoడ భూమిన్యూస్ ఆగష్టు 7)
ఈరోజు అందోల్ మండలం, గూడెం ( అందోల్) గ్రామంలో తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం – శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ మరియు డా .అరుణ ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక కార్యక్రమం (పి ర్ ఏ) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ర్ – విద్యార్థులు గూడెం ( అందోల్) గ్రామంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు మరియు సమస్యలు పటాల ఆధారంగా రైతులకు వివరించడం జరిగింది. వ్యవసాయ రంగంలో భాగంగా గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో విత్తడం జరిగింది అలాగే రైతులకు ఉన్న వనరుల గురించి అలాగే మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం రైతులకు క్లుప్తంగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో టీ ర్ వి కే – సంగుపేట్ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఈ కార్యక్రమం వల్ల గ్రామంలో ఉన్న ఆర్థిక సామాజిక ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు అని రైతులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ విస్తరణ అంశాలు అనగా ట్రాన్సాక్ట్ వాక్, చపాతీ పటం, సామాజిక పటం, వెన్ డయాగ్రం, సమస్యల చెట్టు, కాలనుగుణం పట్టిక, మాట్రిక్స్ ర్యాంకింగ్ మొదలైన వాటిని విద్యార్థులు క్లుప్తంగా వివరించారు. కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్ YP 1- S. శ్రీకాంత్ మరియు ఆకాష్ , వ్యవసాయ విద్యార్థులు A. సృజన్, M. నవజీవన్, B. చoదు, D. వరుణ్, బి. దినేష్ మరియు గ్రామ రైతులు బట్ట నర్సింలు , R. పవన్, వినయ్, శివరాజ్ వినోద్, కేశయ్య నవీన్, జగదీష్ మరియు తది తరులు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


