సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్

సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్

( మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 7)

సమయం చాలా విలువైనదని, కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని అదనపు కలెక్టర్ నగేష్  అన్నారు. చేగుంట మండలం లో వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర హాస్టల్ ను . గురువారం ఆద న పు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా బోధన, నీరు , ఆహారం, సౌకర్యాలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇంగ్లీష్, గణితం సబ్జెక్టులకు సంబంధించి విద్యార్థినిలను పలు ప్రశ్నలను అడిగారు. ప్రస్తుతం పోటీ ఎక్కువగా ఉందని, ఉన్నత చదువులు చదివిన వారు కూడా చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారని, చదువుతో పాటు నైపుణ్యాలు (స్కిల్స్) కూడా ఉంటేనే అనుకున్న ఉద్యోగం వస్తుందని వివరించారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు ఒక ఆయుధమని, లక్ష్యాన్ని పెట్టుకొని ప్రణాళికతో చదవాలని అన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!