ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.వహించాలి కలెక్టర్

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖoడభూమి న్యూస్ ఆగస్టు 7)

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ‌ 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలి. శంకరంపేట మండలంలో ‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ‌ క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ లో 100% ఉత్తినేత లక్ష్యంగా కృషి చేయాలని ‌ జిల్లా కలెక్టర్ రాహుల్ ‌ రాజ్ అన్నారు.

శంకరంపేట మండల కేంద్రంలో ‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు.ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు, మందుల స్టాక్ వివరాలను తనిఖీ చేశారు,

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సబ్ సెంటర్ల వారీగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని అవసరమున్న చోట వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్లకు అందుబాటులో వైద్యులు ఉండాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్య నివేదికలు సిద్ధం చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాత శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని,

రానున్న రోజుల్లో నిర్వహించే నూలు పురుగు దినోత్సవం, బోదకాలు నివారణ కార్యక్రమం మందుల పంపిణీ షెడ్యూల్ ప్రకారం సంబంధిత సిబ్బందితో విజయవంతం చేయాలని ఆదేశించారు, చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో 100. శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!