గాంధీ-అంబేద్కర్ ల ఆశయాలు సాధిస్తాం!
రాష్ట్రంలో మనువాదాన్ని, కులోన్మాధాన్ని మతోన్మాదాన్ని అంతం చేస్తాం
( సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 8 )
వక్రీకరించబడిన మహనీయుల చరిత్రను బహిర్గతం చేద్దాం!!!
జైభారత్ రణభేరి పేరిట 100 సభలు పోస్టర్ల, కరపత్రాల ఆవిష్కరణ రణభేరి రాష్ట్ర కన్వీనర్ డా. ముప్పారం ప్రకాశం
అంబేద్కర్, గాంధీజీల మధ్య సమాజంలో నెలకొన్న అబద్ధాలను బద్దలుకొట్టడానికి, మనువాదానికి, కుల, మత విద్వేషానికి వ్యతిరేకంగా జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పనిచేస్తోందని రణభేరి రాష్ట్ర కమిటీ కన్వీనర్ ఖదిజ్ఞాసి డాక్టర్ ముప్పారం ప్రకాశం అన్నారు.
శుక్రవారం సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని తారా డిగ్రీ కళాశాలలో జరిగిన సన్నాహక సమావేశంలో అనంతరం ఆ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పోస్టర్ల, కరపత్రాల ఆవిష్కరణ అనంతరం జరిగిన సమావేశంలో ప్రకాశం మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ‘గాంధీ – అంబేడ్కర్ల ఆశయాలు సాధిద్దాం! మనువాదాన్నీ, మతోన్మాదాన్నీ, కులోన్మాధాన్ని అంతం చేద్దాం!’ అనే లక్ష్యంతో జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పేరిట 100 బహిరంగ సభలు నిర్వహిస్తున్నమని అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 తారీఖున మొదటి సభ జోగిపేట లో నిర్వహిస్తున్నామని ఈ సభలో మెరుగైన సమాజ నిర్మాణాన్ని కోరే అందరూ హాజరు కావాలని అన్నారు.
నేటి రాజకీయ పార్టీల స్వార్థానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రతీఘాత విష శక్తుల పదాతి దళంగా మారవద్దు అని… సామాజిక విప్లవ సమర వీరులుగా పోరాడడానికి తమతో కలిసి రావాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కులోన్మాదం, మతోన్మాదం అని.. ఈ సమస్యలపై జైభారత్ నిరంతరంగా పోరాటం చేస్తోందని అన్నారు. దేశం కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన గాంధీజీని మతోన్మాదులు దేశానికి శత్రువుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. దీన్ని జైభారత్ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఆర్.ఎస్.ఎస్ మొదటి నుండి కుల వ్యవస్థకు అనుకూలంగా… మనువాదానికి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రిజర్వేషన్ల కి వ్యతిరేకం అని అన్నారు.
అలాగే పూనా పాక్ట్ విషయంలో గాంధీజీ పట్ల ఎస్సీ సమాజంలో ఉన్న అపోహలను సంపూర్తిగా తొలగించేందుకు… గాంధీ, అంబేద్కర్ లు శతృవులు కారు అనడానికి రణభేరి సభలు ఒక చరిత్రగా నిలుస్తాయని అన్నారు. గాంధీ చేసిన దీక్ష రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదు.. కేవలం విడి నియోజకవర్గాలకు మాత్రమే వ్యతిరేకం అని అన్నారు. అలాగే విడి నియోజక వర్గాల ద్వారా కేంద్ర అసెంబ్లీ లో దళితుల సీట్లు 71 నుంచి 148కి పెరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సాహసం జిల్లా కార్యదర్శి పల్లె కిరణ్ కుమార్, ప్రముఖ న్యాయవాది మాతంగి చిరంజీవి, జై భారత్ సామాజిక విప్లవ రణభేరి నాయకులు పల్లే కిషోర్ కుమార్, శివకుమార్, రాబర్ట్ ప్రవీణ్, రోహిత్, దినకర్, దయాకర్, రమేష్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం
-
మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్
-
శుక్రవారం మద్దూరు మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక పర్యటన..
-
ఖబర్దార్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.టిఎన్జీవోస్ అధ్యక్షులు& జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
-
జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.