తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం
(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 8 )
• రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా .
అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా కి డాక్టర్ల సంఘం ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు .
డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా . తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా.అజయ్ కుమార్ తో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చలు జరిపారు. టిజిజిడిఏ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో శనివారం సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం అయ్యారు.డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు .ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (టీజిజిడిఎ) అధ్యక్షులు డా. నరహరి , సెక్రెటరి జనరల్ డా.లాలు ప్రసాద్ , డా .రాహుఫ్ , డా.వినయ్ కుమార్ , డా .గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా .రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
You may also like
-
టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం
-
మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్
-
శుక్రవారం మద్దూరు మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక పర్యటన..
-
ఖబర్దార్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.టిఎన్జీవోస్ అధ్యక్షులు& జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
-
జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.