జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.

జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 8 )

జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్

హవేలీ గన్ పూర్ మండలందూప్ సింగ్ తండా కాజ్ వే నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉంటూ, డైవర్షన్ ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని , వరద ఉధృతి ఉన్నప్పుడు ఎవరినీ అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం రోజు హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండా కాజ్ వే నిర్మాణ పనులు సంబంధిత పంచాయతీరాజ్ ఈ .ఈ గోపాల్ తో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

దూప్ సింగ్ తండా కాజ్ వే 03 కోట్ల రూపాయల వ్యయంతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణ పనులు కొనసాగుతుందని తొందర్లో పనులు పూర్తి చేసి తాండవాసులకు ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.

వాతావరణ ప్రతికూల ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిల్లాలో ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.గ్రామపంచాయతీలలో శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసాలు ఉండొద్దని అన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా ప్రజలు కాచి చల్లార్చిన వాటర్ నే త్రాగాలన్నారు.

జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని వర్షాలు ఆగిపోయేంతవరకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు

రెవెన్యూ,పోలీస్ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉంటూ ఓవర్ ఫ్లో అవుతున్న చెరువులు వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు వంకలు దాటనియ్యరాదని, ప్రవహిస్తున్న వరదనీటిలో వెళ్లకుండా చూస్తున్నారని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి

వరద ప్రవాహం ఎక్కువ గా ఉన్నపుడు రోడ్డు దాటడం లాంటివి చేసి ప్రమాదాలు తెచ్చుకోకూడదు అని తెలిపారు.

ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా రెవెన్యూ యంత్రంగా మొత్తంకూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!