ఖబర్దార్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.టిఎన్జీవోస్ అధ్యక్షులు& జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 8)
జిల్లా పాలనాధికారికి , ఇతర ప్రభుత్వ అధికారులకు నాన్ గెజిటెడ్, గెజిటెడ్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ ,అండగా ఉంది.-మెదక్ పాలనాధికారి మనోభావాలు దెబ్బతిస్తే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి వారైనా సహించం
బహిరంగ క్షమాపణ చెప్పాలి , అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. లేదంటే రాజీనామా చేయాలి.
నిరసనలు నినాదాలతో మారుమోగిన కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణం
కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో భోజన విరామ సమయంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై నిరసనలు తెలియజేస్తూ టీఎన్జీవోస్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ నాన్ గెజిటెడ్, గెజిటెడ్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముక్తకంఠంతో నినాదాలు చేశారు.
ఈనెల 7వ తేదీన మెదక్ కలెక్టరేట్ కార్యాలయ ధర్నా చౌక్ వద్ద టిఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహించారు
ఆ సమావేశంలో దుబ్బాక శాసనసభ్యులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించింది.
ఈ వ్యాఖ్యలకు నిరసనగా ముక్తకంఠంతో ఖండిస్తూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు..
మెదక్ జిల్లా టిఎన్జీవోస్ యూనియన్ అధ్యక్షులు దొంత నరేందర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాల పట్ల జవాబుదారితనం పారదర్శకత లక్ష్యంగా మెదక్ జిల్లాలో ప్రగతి పాలన అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ సమిష్టిగా కృషి చేస్తారని అటువంటి సమర్థ వంతమైన పాలన అందిస్తున్న జిల్లా కలెక్టర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని తెలిపారు. ఇకముందు ఏ ప్రభుత్వ అధికారికైనా అన్యాయం జరిగితే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి అండగా మెదక్ జిల్లా తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ అండగా ఉండటంతో పాటు వారిని రక్షించడం జరుగుతుందన్నారు.
రాజకీయాలకతీతంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ప్రభుత్వ అధికారులు అమలు చేస్తారన్నారు. మెదక్ జిల్లా ప్రభుత్వ అధికారులు విధుల పట్ల చిత్తశుద్ధి అంకితభావంతో పనిచేస్తారని తెలిపారు.
ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు
. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ సెక్రెటరీ జనరల్ విటల్, టీఎన్జీవో సెక్రెటరీ రాజ్ కుమార్, క్లాస్ ఫోర్త్ అధ్యక్ష కార్యదర్శులు జలగం ప్రసాద్, రిజ్వాన్ అలీ, ఎస్ టి యు అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, టి టి యు అధ్యక్షులు శివయ్య, టిఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫజాలుద్దీన్, సంయుక్త కార్యదర్శులు శంకర్, శివాజీ, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు జంగం నగేష్, గోపాల్, శ్రీ హర్ష ధనుంజయ్, జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.
You may also like
-
టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం
-
మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్
-
శుక్రవారం మద్దూరు మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక పర్యటన..
-
జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.
-
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం