శుక్రవారం మద్దూరు మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మిక పర్యటన..
(సిద్దిపేట జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు8)
1.
మద్దూరు మండల కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెంటెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసి మెడికల్ ఆఫీసర్ డా. రజిత లీవ్ లెటర్ జిల్లా వైద్య శాఖ అధికారులకు పంపించి సెలవు తీసుకున్నట్లు తెలపగా డిప్యూటీ డి ఎం అండ్ ఎచ్ ఓ కీ ఫోన్ లో మాట్లాడి నిజనిర్ధారణ చేసి అనుమతి లేనిదే సెలవు మంజూరు చేయవద్దని ఆదేశించారు. ఓపి రిజిస్టర్ వెరిఫై చేస్తూ మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఓ పి రిజిస్టర్ రాయాలని నర్సులు రాస్తూ మీరే మెడిసిన్ లు ఇవ్వకూడదని హేచ్చరించారు. ఆయుష్ డాక్టర్ నాజ్య తో మాట్లాడుతూ మండలంలో చేస్తున్న ఆక్టివిటీస్ గురించి అడిగారు. ల్యాబ్ గదినీ వెరిఫై చేస్తూ రోజు వారిగా ఎన్ని పరీక్షలు నిర్వహిస్తారనీ ఆరా తీశారు. స్టోర్ గదిలో పరిశీలిస్తూ పలు రకాల మెడిసిన్ లను చెక్ చేశారు కాలం చెల్లిన మెడిసిన్ లను వాడకూడదని ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు.
2.
మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు గ్రౌండింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 21 ఇండ్లు శాంక్షన్ కి 21 గ్రౌండింగ్ అయ్యాయని ఏం పి ఓ కలెక్టర్ కి తెలిపారు. నిర్మాణంలో ఉన్న చిలుక లక్ష్మీ ఇంటిని పరిశీలిస్తూ ఇంజనీర్ అధికారులు బేస్ మెంట్ పూర్తయిన ఫోటోలు తీసుకున్న పేమెంట్ రాలేదని అడగ్గా ఏలాంటి సాంకేతిక సమస్యలు లేకుంటే అతి త్వరలో మీ అకౌంట్లో జమవుతాయని తెలిపారు. మోతే చంద్రమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తూ బేస్మెంట్ పూర్తి మొదటి విడత పేమెంట్ వచ్చినట్లు కలెక్టర్కు తెలిపారు. ఇంటి నిర్మాణం వేగంగా పూర్తి చేసి గృహప్రవేశం చేయాలని సూచించారు.
3.
మండలంలోని లద్నూరు గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనికి చేశారు. మధ్యాహ్నం 12:00 గంటలు అయిన కూడా పిఎచ్ సి లో డాక్టర్ సుదీర్ రాజు తప్ప డాక్టర్లు అర్జున్ రాజు, మహేందర్ లు గైర్హాజరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ కంటి వైద్య డాక్టర్ భాస్కర్ రెడ్డి రిజిస్టర్ లో సంతకం పెట్టీ ఫీల్డ్ లో వెళ్లినట్లుగా తెలపగా ఫోన్ వీడియో కాల్ లో ఫీల్డ్ లో లేకుండా బయట ఉన్నట్లు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎం అండ్ ఎచ్ ఓ కీ ఫోన్ చేసి గైర్హాజరైనా డాక్టర్లు, కంటి డాక్టర్ పైన విచారణ జరిపి కఠిన యాక్షన్ తీసుకోవలసిందిగా అలాగే ఇద్దరు స్టాఫ్ నర్సు డిప్యూటేషన్ లు రద్దు చెయ్యాలని డిఎంఅండ్ఎచ్ఓ కీ ఫోన్ చేసి ఆదేశించారు. గ్రామస్తులు గ్రామంలో ఫైలేరియా బారిన పడిన వారి సంఖ్య పెరుగుతున్నందున పైలేరియా క్యాంపు నిర్వహించాలనీ కలెక్టర్ ని కోరగా వెంటనే స్పందించి ఫైలేరియా క్యాంపు తప్పనిసరిగా పెట్టిస్తానని పిహెచ్సిలో పైలేరియాకు సంబంధించి మందులు అందుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు. 24/7 అందుబాటులో ఉండాలని బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టాలని పలువురు గ్రామస్తులు కలెక్టర్ కి పిటిషన్ అందజేశారు. వైద్యం చేయడం లో నిర్లక్షం వహిస్తే సహించేది లేదని తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని గ్రామస్తులకు కలెక్టర్ తెలిపారు. అలాగే పిఎచ్ సి లో మేజర్- మైనర్ రిపేర్లు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
మద్దూరు మండలం తాసిల్దార్ కార్యాలయంలో భూభారతి అప్లికేషన్లో డిస్పోజల్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏలాంటి కేసులు పెండింగ్లో ఉన్నాయో ఆన్లైన్లో పరిశీలించారు. డిస్పోజల్ ప్రక్రియ వేగంగా చేయాలని తాసిల్దార్ ను ఆదేశించారు.
కలెక్టర్ వెంట తహసిల్దార్ రహీమ్, ఏంపిఓ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
You may also like
-
టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం
-
మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్
-
ఖబర్దార్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.టిఎన్జీవోస్ అధ్యక్షులు& జేఏసీ చైర్మన్ దొంత నరేందర్
-
జిల్లాలోని వరద పరివాహక ప్రాంతంలో కాజ్ వేలు, వాగులు, బ్రిడ్జిల ప్రజల రాకపోకలపై అప్రమత్తంగా ఉండాలి.
-
తెలంగాణ వైద్య విధాన పరిషత్ ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం