మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్

మొక్కలతోనే మానవుడికి ప్రాణవాయువు అదనపు కలెక్టర్ నగేష్

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 8 )

మానవాళికి ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచే బాధ్యత మనమందరం తీసుకుందామని *అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.

శుక్రవారం ఇండస్ట్రియల్ ఎస్టేట్, మనోహరాబాద్ మండలంలో

లోకేష్ మిషన్స్ కల్లాకల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అదనపు కలెక్టర్ నగేష్ వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లా పరిశ్రమల శాఖ వనమహోత్సవ లక్ష్యాల మేరకు మొదటి విడతలో 2000 మొక్కలు నాటుతున్నారని,రెండో విడతలో ఇంకొక 3000 మొక్కలు , మొత్తం 5000 మొక్కలు నాటుతున్నారని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ మెదక్ జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తాసిల్దార్

లోకేష్ మిషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు సిబ్బంది వారి ఎంప్లాయిస్ పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!