టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం 

టీవివీపీను త్వరలో సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ గా అప్ గ్రేడ్ చేస్తాం

 

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 8 )

టీచింగ్ ఆసుపత్రులలో పని చేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్స్ లను ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయం .

పెద్దఎత్తున ప్రొఫెసర్స్ లకు పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు .

తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ( సి ఏ ఎస్ ) 1690 డాక్టర్ పోస్టుల భర్తీ చేసేందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గ్రీన్ సిగ్నల్.

 

* నాన్ టీచింగ్ విభాగం లో డి ఎం ఈ , డి హెచ్ , టీవివీపీ లలో టైం బాండ్ ప్రమోషన్ ల భర్తీలో వయోపరిమితి పెంపు పై కామన్ నిబంధనలు రూపొందించటానికి ఎక్సపర్ట్ కమిటీ

* తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడి .

 

* స్వాగతించిన ప్రభుత్వ డాక్టర్ల సంఘం ప్రతినిధులు.

 

టీ జి జి డి ఏ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో శుక్రవారం ,సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశమయ్యారు. ఈ సమవేశం లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవివీపీ) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తామన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా. వైద్య విధాన పరిషత్ ను డైరెక్టర్ సెకండరీ హెల్త్ గా అప్ గ్రేడ్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు దోహద పడుతుందన్నారు. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ లలో సేవలు అందిస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్స్ లను ప్రొఫెసర్స్ గా పెద్ద ఎత్తున పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు . ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలోని డాక్టర్లు అంతా హర్షం వ్యక్తం చేశారని మంత్రికి అసోసిషన్ ప్రతినిధులు వెల్లడించారు . ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు .

 

తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ( సి ఏ ఎస్ ) 1690 డాక్టర్ పోస్టుల భర్తీ చేసేందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు. డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఈ సందర్బంగా ఆదేశించారు . నాన్ టీచింగ్ విభాగం లో డీమ్ , డి హెచ్ , టి వి పి లలో టైం బాండ్ ప్రమోషన్ ల భర్తీలో వయోపరిమితి పెంపు పై కామన్ నిబంధనలు రూపొందించటానికి ఎక్సపర్ట్ కమిటీ నీ నియమిస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహా. డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు .

 

ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ ( టి జి జి డి) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!