ఏపీజీబీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కే.విజయభాస్కర్ రెడ్డి కర్నూల్ కుబదిలీ

అఖండ భూమి వెబ్ న్యూస్ :
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానికంగా గల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నందు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గా కే విజయభాస్కర్ రెడ్డి గత మూడు సంవత్సరములుగా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతము కర్నూలు నందుగల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు బదిలీ అయ్యారు. బదిలీ సందర్భంగా శుక్రవారం రోజు బ్రాంచి అధికారులు, వివిధ బ్రాంచి అధికారులు మరియు బ్రాంచిసిబ్బంది కలిసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కే.విజయభాస్కర్ రెడ్డికి శాలువా మరియు పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. బ్రాంచ్ అధికారులు మాట్లాడుతూ లావాదేవీలలో గతంలో కంటే మూడు సంవత్సరాల లో ఎంతో పురో భివృద్ధి వైపు విధులు నిర్వహించి ఖాతాదారులతో మరియు సిబ్బందితో అనుకూలంగా స్పందించి వెల్దుర్తి బ్రాంచి పురోభివృద్ధి వైపు కొనసాగినదని తెలిపారు. బ్రాంచ్ సిబ్బంది,ఖాతాదారులు, బి. సి లుసానుకూలంగా,సన్నిహితంగా స్పందించినందుకు కె. విజయభాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్నివేశంలో బ్రాంచ్ అధికారులు అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ పి.భాస్కర్ రెడ్డి,అసిస్టెంట్ మేనేజర్ రుషేంద్ర బాబు, అసిస్టెంట్ మేనేజర్ ఏ. లింగన్న మరియు ఆఫీసర్ వై.ప్రశాంత్ వర్ధన్ మరియు పలు గ్రామాల బ్రాంచ్ బీసీలు, హరి,మద్దయ్య, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,


