ఘనంగా జిల్లాలో రక్షాబంధన్ వేడుకలు …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఆగష్టు 9 (అఖండ భూమి న్యూస్);
, కామారెడ్డి జిల్లాలోని ఆయా గ్రామాలలో రక్షాబంధన్ ఉత్సవాలను ప్రజలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతల కు చిహ్నంగా నిలిచే రాఖీ పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంట్లో సోదరి మణులు తమ సోదరులకు రాఖీలు కట్టి అప్యాయతను చాటారు. యువతులు, మహిళల సందడితో ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా లో మొత్తానికి రక్షాబంధన్ కార్యక్రమాన్ని సంతోషంతో జరుపుకున్నారు.