అడవిలింగాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి …      

అడవిలింగాల గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్ట్ 9 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని అడవి లింగాల గ్రామ శివారులో గల ట్రాన్స్ఫార్మర్ దగ్గర శనివారం నాడు విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సమీపంలో ఊర్లోకి సరఫరా అయ్యే బోరు బావి సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఎత్తు తక్కువగా ఉండడం వళ్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అడవి లింగాల గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం కు చెందిన ఆ రెండు మేకలు మృతి చెందడంతో ఆయనకు దాదాపు 30 వేల రూపాయలు నష్టం వాటిల్లిందని, బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పోలీసు రాజుకు సంబంధించిన ఎద్దు మృతి చెందినట్లు తెలిపారు ప్రమాదకరంగా ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ ఎత్తు పెంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!