మనకు దానం చేయాలంటే చాలా వున్నాయి…
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 9,(అఖండ భూమి న్యూస్) ;
మనం ఎదుటి వారికి ఏమి ఇస్తే అదే తిరిగి వస్తుంది అనే మాట చాలా సార్లు విని ఉన్నాము. కాదా,చాలాసార్లు ఎవరో ఎవరికో డబ్బు సాయం చేశారని పేదలను ఆదుకున్నారని భగవంతునికి బంగారు కిరీటం సమర్పిం చారని లేదా ఇంకేదో అర్పించా రని వినగానే మనకు ఉంటే ఇవ్వకపోదునా? నా దగ్గర ఏమి ఉంది. ఇవ్వటానికి అను కుంటాము కదా, ఇలాగే ఆలో చించిన ఒక పేదవ్యక్తి బుద్ధుని అడిగాడట నేను పేదవాడిగా ఎందుకు ఉన్నాను?” అని.అందుకు సమాధానంగా బుద్ధభగవానుడు.నీ దగ్గర ఉదారత లేని కారణంగా, నీ దగ్గర ఉన్నది ఇచ్చే గుణం లేకపోవడం వల్ల!” అన్నాడట నేనే పేద వాడిని నేను ఎవరికి ఏమి ఇవ్వగలను అన్నాడట ఆ పేదవాడు.
అప్పుడు బుద్ధుడు నీ దగ్గర ఐదు గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ నువ్వు అవి ఎవరికీ పంచటం లేదు. వాటిని పంచటం ద్వారా నీ ఉదారత్వం చూపించవచ్చు.
నా దగ్గర ఐదు విషయాలు ఉన్నాయా? అదీ నాకు తెలి యకుండా అంటూ అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ పేదవాడు. అందుకు బుద్ధుడు మొదటిది నీ చిరునవ్వు. ఎదు టి వారిని చూడగానే అందమైన చిరునవ్వుని చిందించవచ్చు. కానీ అది నీవు చేయ వు.అలాగే రెండవది, నీవు ఈ లోకాన్ని చూసే కనులతో దయ ప్రేమ, శ్రద్ద ఎదుటి వారికి అందించవచ్చు. కానీ అది.నీవు చేయవు మూడవది నీవు తినటానికి, మాట్లాడటానికి మాత్రమే అనుకునే నోటితో నాలుగు మృదువైన మంచి మాటలు చెప్పవచ్చు. కానీ నువ్వు అది చేయవు.
నాలుగవది నీ హృదయమంది రం నుంచి మనస్ఫూర్తిగా ఎదు టివారినిఅభినందించవచ్చు. కానీ నువ్వు అది చేయవు.
ఇంకా ముఖ్యంగా ఐదవది నీ శరీరంలోని అవయవాలు అ న్నీ చక్కగా ఉన్నాయి. నీ కాళ్ళని చేతుల్ని ఉపయోగించి ఎంతయినా సేవచెయ్య గలవు కానీ నువ్వు అది చేయవు.ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఎన్నో కలిగి ఉన్నాము.
దానం అంటే ఉదారత్వం.అంటే ఎదుటి వారికి డబ్బు లేదా వస్తువులు ఇవ్వటం మాత్రమే కాదు, మనకి ఉన్నంతలో చేతనయినంతలో ఇతరులకి ఇవ్వటమే ఉదారత్వం అంటూ తెలియచేశాడు. బుద్ధ భాగవానుడు.
బలి చక్రవర్తి సత్యహరిచంద్రుడు, దాన కర్ణుడు, కాలికాలంలో
మదర్ తెరిస్సా, సిస్టర్ నిర్మల
ఆధునిక కాలం మైక్రోసాఫ్ట్ అధినేత ,సుధమూర్తి, సంకల్పం
ఉంటే ఏదైనాచేయగలం. డబ్బు
రూపంలోనే కాదు సేవరూపం
నీ కంటి ముందు ఉన్న వారికి
సహాయం చెయ్యు, విద్యాదానం, అవయవదానం, రక్తదానం,
నీటి దానం,ఎన్నో రకాలుగా చేయవచ్చు. మానవ సేవేమాధవ సేవ,అదే సత్యం,ప్రాణం పోయిన తర్వాత అగ్నికో ,భూమి లో ఆకారం లేకుండా మారి పోతుంది.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



