మతంతో సంబంధం లేకుండా దళితులకు ఎస్సీలుగా గుర్తించాలి

మతంతో సంబంధం లేకుండా దళితులకు ఎస్సీలుగా గుర్తించాలి

 

(జహీరాబాద్ మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 )

ఆగస్టు 10న బ్లాక్ డే పాటించిన డిఎస్ఎం

జహీరాబాద్, ఆగస్టు 10 : దళిత క్రైస్తవుల మత స్వేచ్ఛను హరించిన ఆగస్టు 10వ తేదీని బ్లాక్ డే పాటిస్తున్నట్లు దళిత సాలిడారిటీ మూవ్ మెంట్ (డిఎస్ఎం) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు హేమానంద్ అన్నారు. పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదవ తారీఖున తీసుకు వఛ్చిన రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా దళిత క్రైస్తవుల హక్కులు కాలరాయబడ్డవని, దళితులు మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెపుతున్న ఆ రాష్ట్రపతి ఉత్తర్వు అగ్రవర్ణాల కుట్ర అని మండిపడ్డారు.

అప్పటి రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల హక్కులను కాలరాసిందని వెంటనే ఆ ఉత్తర్వును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తమన్నారు.

అనంతరం డిఎస్ఎం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిరసన దినంగా పాటించారు. మతంతో సంబంధం లేకుండా దళితులకు ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయికోటి నర్సిములు, జిల్లా నాయకులు శ్రీకాంత్ జాన్ చింతల్ గట్టు, శివరాజ్, దేవన్న దాస్, ప్రసాద్,స్టీఫెన్ నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!