పేద ప్రజల గొంతుకై నిలిచిన సిపిఐ.

పేద ప్రజల గొంతుకై నిలిచిన సిపిఐ.

 

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 )
ఆగస్టు 20 21 22న మేడ్చల్ లో జరిగే సిపిఐ తెలంగాణ 4 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.
త్యాగాల పోరాటాల చరిత్రలో సిపిఐ కి 100 సంవత్సరాలు

సిపిఐ సంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 20 నుండి22 వరకు మేడ్చల్ జిల్లాలో జరగనున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభల పోస్టర్లను నేడు సిపిఐ జిల్లా కార్యాలయం లో ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వీర్ల ప్రకాష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ రాష్ట్ర మహాసభలలో తెలంగాణలో జాతీయ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారన్నారు రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి రానివ్వకుండా పోరాడాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారన్నారు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయడానికి ఇప్పటినుండే కార్యకర్తలను సన్నద్ధం చేస్తారన్నారు రాష్ట్రంలో రానున్న మున్సిపాలిటీ జెడ్పిటిసి గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి కార్యకర్తలని సన్నద్ధం చేస్తారన్నారు రాష్ట్ర మహాసభల్లో దేశంలో బిజెపి మోడీ అరాచకాలను ఎలా తిప్పి కొట్టడానికి కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తారన్నారు, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారన్నారు ఈ మహాసభలలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు ఎంఏ రెహమాన్ , ఆనంద్ కార్యదర్శివర్గ సభ్యులు ఎండి మహబూబ్ ఖాన్ k. నర్సింలు దత్తు రెడ్డి అశోక్ జిల్లా కౌన్సిల్ సభ్యులు చిరంజీవి ఎంఏ ఖాజా అజారుద్దీన్ అశ్వక్ హుస్సేన్ వెంకటరాజ్యం బి. అనురాధ పట్టణ సమితి సభ్యులు సిహెచ్ కవిత కే శంకర్ ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పత్రికా అభినందనలతో……
ఎండి. మహబూబ్ ఖాన్ సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పట్టణ ప్రధాన కార్యదర్శి సంగారెడ్డి

Akhand Bhoomi News

error: Content is protected !!