రంగంపేట తిరుమల రైస్ మిల్ లో చోరీ

రంగంపేట తిరుమల రైస్ మిల్ లో చోరీ

 

(కొల్చారం మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10 ) మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు మండల పరిధిలోని రంగంపేట గ్రామ శివారులోని తిరుమల రైస్ మిల్ లో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. తిరుమల రైస్ మిల్ ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి లోనికి చదవబడిన దొంగలు బీరువాలో ఉన్న సుమారు నాలుగు లక్షల రూపాయలు చోరీకి పాల్పడినట్టు బాధితుడు ముప్పుడి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్సై మహమ్మద్ మోహియోద్దీన్ విచారణ చేపట్టారు. క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!