పాకిస్తాన్ ఉగ్ర దేశం అని మరోసారి రుజువైంది”
— విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 12.(అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజు విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ అమెరికా పర్యటనలో ఉన్నా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారతదేశాన్ని ఉద్దేశించి అణు బెదిరింపులు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు
“భారత్‌పై అణు బాంబుల దాడి చేస్తామని ప్రకటించడం పాకిస్తాన్ యొక్క రూపం ఇతర దేశాలు అర్థం చేసుకోవాలన్నారు ఉగ్రవాద దేశంగా స్పష్టమైన నిదర్శనం. ఈ వ్యాఖ్యలతో ఆ దేశం అసలు ముఖచిత్రం ప్రపంచానికి మరోసారి బహిర్గతమైంది,” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వినయ్ కుమార్ ప్రపంచ దేశాలను డిమాండ్ చేశారు.
ఇటువంటి బెదిరింపులకు భారతదేశం భయపడేది లేదని, ప్రతిస్పందించాల్సి వస్తే పాకిస్తాన్‌ను నేలమట్టం చేసే శక్తి భారత్‌కు ఉందని ఆయన హెచ్చరించారు. “భారత యువత దేశ భద్రత కోసం ఏ సమయంలోనైనా పోరాటానికి సిద్ధంగా ఉంది అన్నారు
ఈ సమావేశంలో విద్యార్థి సేన నాయకులు రాహుల్,దినేష్, మధు, గోపాల్, నవీన్, అంజి, తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



