సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 12 (అఖండ భూమి న్యూస్);

హైదరాబాద్ లోని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి కి పుష్పగుచ్చం అందించారు.సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదములు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సీఎం కోరినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెల్సుకున్నారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!