నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్

రసాయన ,ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12)

రసాయన ,ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం ప్రజావాణి హాల్ నందు ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీతో సమావేశం నిర్వహించారు.

గత జూన్ 30 న సంగారెడ్డి జిల్లా, పాశమైలారం లో సంభవించిన అతిపెద్ద విస్ఫోటనాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, ప్రత్యేకించి రసాయన పరిశ్రమలు, ఔషధ యూనిట్లలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసి, ఆ కమిటీల ద్వారా ఆయా పరిశ్రమలలో భద్రతను తనిఖీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ అంశం పై మెదక్ జిల్లాలో జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, కార్మిక ,కాలుష్య నియంత్రణ మండలి, తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్మికులు భద్రతపై దృష్టి సారిస్తూ కర్మాగారాలలో పనిచేసే కార్మికుల యొక్క :ఫోన్ నంబర్స్ పూర్తి సమాచారం యాజమాన్యం దగ్గర ఉండాలని, పరిశ్రమలలో పనిచేసే కార్మికులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా, చూడాలని, మత్తు పదార్థాలు వాడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిన పక్షంలో యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఫ్యాక్టరీల డైరెక్టర్ అంతర్నిర్మిత భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి కమిటీ ఆయా రసాయనిక పరిశ్రమలు, ఔషధ యూనిట్లను తనిఖీ చేసి నిర్దేశించిన ప్రొఫార్మా లో నివేదిక సమర్పించాలని , ఇదే అంశంపై నివేదిక అందిన తర్వాత తిరిగి సమీక్షిస్థానని కలెక్టర్ తెలిపారు

జిల్లాలోని అన్ని పరిశ్రమలు ,రసాయనిక, ఔషధ యూనిట్లలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ , ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, తూప్రాన్ జై చంద్ర రెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య ,డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు,డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ శ్రీనివాసరావు, కర్మ గారాల జిల్లా ఉప ప్రధాన అధికారి శ్రీమతి లక్ష్మీ కుమారి, జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రకాష్ రావు జిల్లా అగ్నియాపక శాఖ అధికారి, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక శాఖ అధికారులు,ఇతర సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Akhand Bhoomi News

error: Content is protected !!