జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో సౌర విద్యుత్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలి
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 12)
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో సౌర విద్యుత్ ఏర్పాటుకు నివేదికలు రూపొందించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో సౌర విద్యుత్ ఏర్పాటుకు 3 రోజులలో నివేదిక రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, తూప్రాన్ జయచంద్ర రెడ్డి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, డిఎం రెడ్ కో రవీందర్ చౌహన్ లతో కలిసి జిల్లా అధికారులతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అన్ని యాజమాన్యాల గురుకులాలలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని, ఈ మేరకు ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన వైశాల్యం, నెలకు విద్యుత్ వినియోగం వంటి వివరాలను నిర్ణీత నమూనాలో పూరించి 3 రోజులలోగా నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కార్యాలయాలలో కాళీ స్థలాల వివరాలను అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు .