భూములకు సంబంధించిన చట్టాలపై, భూభారతి చట్టం 2025 పై అవగాహన
(కొల్చారం మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 13) పంటలు సాగు చేసే రైతులకు న్యాయ సేప్రచారం మండలం మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రాలలోని రైతు వేదికలలో ఆయా మండలాల తహసిల్దార్ లు శ్రీనివాసాచారి, శ్రీనివాస్, ల అధ్యక్షతన సాగు న్యాయ యాత్ర రైతు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటలు సాగు చేసే రైతులు విత్తనం వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే మార్కెట్ కు తరలించే వరకు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిన చట్టాలను రైతులకు తెలియజేయడం ద్వారా చట్టం రైతులకు చుట్టంగా మారి లీవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయ యాత్ర కార్యక్రమం చేపట్టినట్లు భూమి సునీల్ అన్నారు.
తినడానికి తిండి కోసం పంటలు పండించే దశ నుంచి మార్కెట్లో విక్రయించడం కోసం వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం కోసం, సాగు విధానంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా సాగు సాఫీగా సాగడం కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు అమలు లోకి తీసుకు వచ్చింది అన్నారు. రైతులు చట్టాలను తెలుసుకొని వాటిని వినియోగించుకోగలిగితేనే రైతులు ముందుకు సాగే పరిస్థితులు వచ్చాయన్నారు. భూమి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు నాణ్యతలేని విత్తనాలు ఎరువులు పురుగు మందుల వల్ల నష్టం వాటిల్లినప్పుడు మార్కెట్ మోసాలు జరిగినప్పుడు పంటల బీమా అందనప్పుడు ఇలా పలు సందర్భాల్లో రైతులకు చట్టాలతో అవసరం ఏర్పడుతుందన్నారు.
అందుకోసమే ప్రతి రైతుకు చట్టాలు తెలియజేయాలన్న సంకల్పంతో లీఫ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సాగు న్యాయ యాత్ర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన భూములకు సంబంధించిన చట్టాలపై, భూభారతి చట్టం 2025 పై అవగాహన కల్పించారు. భూమి నుండి పట్టాదారు పాసుపుస్తకం లేకపోతే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం 20 25 సెక్షన్ 4 (6) రూల్ 4 ప్రకారం భూభారతి పోర్టల్ లో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని కొత్త పట్టాదారు పాసు పుస్తకం పొందవచ్చని తెలిపారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మీ పాస్ పుస్తకం లో భూమి తక్కువగా నమోదైన సర్వేనెంబర్ మిస్సయిన పట్టాదారు పేరు ఇతర వివరాలు తప్పుగా రాసిన భూమి స్వభావం మారిన భూమి సంక్రమించిన విధానం తప్పుగా నమోదైన భూభారతి చట్టం సెక్షన్ 4(5) రూల్ నాలుగు ప్రకారం భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకొని మార్పులు నమోదు చేసుకోవచ్చని అన్నారు విత్తనం వల్ల నష్టం కలిగితే పరిహారం పొందవచ్చు పంటల సాగులో కీలకమైన విత్తనం వల్ల రైతు నష్టపోతే పరిహారం పొందేలా నూతన చట్టాలను ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నారు. ఇందుకోసం రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలని విత్తనాలు తీసుకువచ్చిన డబ్బా, సంచిని దాచి ఉంచుకోవాలన్నారు. విత్తనాల గురించి సమాచారం తెలుపుతూ ఇచ్చిన కాగితాలను దాచి ఉంచాలని వీలైతే కొన్ని విత్తనాలకు కూడా భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు., పంట నష్టం జరిగితే వెంటనే సంబంధిత కంపెనీ డీలర్ కు ప్రతినిధికి తెలియజేయాలని రైతులకు సూచించారు
పంటల సాగులో సాగునీరే కీలకం సాగునీటి కోసం అనేక చట్టాలు రైతులు పంట సాగులో ప్రతి చొక్కా నీటు నీరు విలువైందని అందుకే ప్రభుత్వం వాల్టా చట్టం తీసుకువచ్చింది అని భూమి సునీల్ అన్నారు. తెలంగాణ వాల్టా చట్టం 2002 ప్రకారం బోరు వేయాలన్నా భావితవ్వాలన్న చెట్టు కొట్టాలన్న ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అన్నారు. తెలంగాణ సాగునీటి చట్టాలు తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి కార్పొరేషన్ చట్టం 1997 సాగునీటి నిర్వహణ చట్టం 1997 సాగర్ సాగునీటి వనరుల నియంత్రణ చట్టం 2009 చట్టాల ద్వారా సాగునీటి నిర్వహణ రాష్ట్రంలో జరుగుతుందన్నారు చెరువులను కాపాడుకోవాలని చెరువులను ఎవరైనా ఆక్రమిస్తే భూ ఆక్రమణ చట్టం 1905 కింద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలపై రైతులకు అవగాహన కల్పించడం కోసం ఈ అవగాహన సదులు క్షేత్రస్థాయి పర్యటన రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులకు రైతులు పంట రుణాలు ఇవ్వాలి
పంట సాగులో రైతులు బ్యాంకు ద్వారా రుణాలు పొందవచ్చు అని ఆర్బిఐ ఆదేశాలను అనుసరించి బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు తెలంగాణ మనీ లీడర్స్ చట్టం 13 49 పసలేని అనుసరించి రుణాలు ఇవ్వాలని రైతులను వేధిస్తే చట్టంపైన పైన చర్యలు ఉంటాయని భూమి సునీల్ రైతులకు అవగాహన కల్పించారు చిన్న రైతుల రుణాల నుండి విముక్తి పొందడం కోసం తెలంగాణ రుణ విముక్తి చట్టం 2016 ప్రకారం రాష్ట్ర రుణ విముక్తి కమిషన్ను ఆశ్రయించవచ్చని ఈ సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు
పంటల బీమా రైతులకు ధీమా
రైతులు సాగు చేసే పంటలకు బీమా చేసినప్పుడే రైతులకు ధీమా ఉంటుందని రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటల బీమా కోసం పథకాలు తీసుకోవచ్చి అమలు చేస్తున్నాయని రైతులకు కూడా ప్రీమియం చెల్లించి పంటల బీమా పొందవచ్చు అన్నారు. అకాల వర్షాలు కరువు పరిస్థితులు, తదితర కారణాల వల్ల పంట నష్టపోతే రైతులు బీమా పొందవచ్చు అన్నారు. ఈ సందర్భంగా
భూమి రిజిస్ట్రేషన్ పట్టాదారు హక్కులు, చట్టపరమైన రక్షణ, భూ వివాదాల పరిష్కార మార్గాలపై విత్తన నష్టాల వల్ల తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ ఓ ఎస్ డి వెంకట హరిప్రసాద్, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, లీవ్ సంస్థ న్యాయవాదులు, ప్రతినిధులు అభిలాష్ జీవన్ మల్లేష్ ప్రవీణ్ సందీప్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల వ్యవసాయ అధికారులు శ్వేతా కుమారి ఏఈవోలు రైతులు పాల్గొన్నారు