క్రీడల్లో ఉద్యోగులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు.
(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 13)
క్రీడల్లో ఉద్యోగులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు.
మెదక్ జిల్లా కేంద్రంలో స్టేడియంలో యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరిచుకొని జిల్లాలో
తేది: 12-08-2025 మరియు 13-08-2025 (02) రోజులలో సాయంత్రం 5.00 గంటల నుండి PNR ఇన్డోర్ స్టేడియం మరియు అవుట్ డోర్ స్టేడియం, మెదక్ నందు నిర్వహించడం జరిగింది. ఉద్యోగులకు (మహిళలకు మరియు పురుషులకు) చెస్, క్యారం మరియు బాడ్మింటన్ లలో క్రీడా పోటీలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. క్యారమ్స్ చెస్, ఇండోర్ స్టేడియంలో బ్యాట్మెంటన్ ఆటలను
కలెక్టర్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ క్రీడలలో మొత్తం సుమారు 190 మంది ఉద్యోగులు నమోదు చేసుకున్నారు. క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు గెలుపొందిన క్రీడాకారులకు ఆగస్టు 15 రోజున ప్రశంసా పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన క్రీడల నిర్వహణాధికారి దామోదర్ రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు