79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వము
మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి
అఖండ భూమి వెబ్ న్యూస్ :
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వము మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది.
పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో వేడుకల కార్యక్రమములో జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం, సాంస్కృతిక ప్రదర్శనలు, విశిష్ట సేవలకుగాను అధికారులకు మరియు ప్రజలకు పురస్కార ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.