భారీ వర్షాలకు కూలిన ప్రహరీ గోడ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 16 (అఖండ భూమి న్యూస్)
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాలకు సంబందించిన గోడ కర్షక్ బీ.ఈడి వెనుక సైడ్ గోడ కూలీ పోయింది. గతంలో మూడుసార్లు కూలీ పోవడం వల్ల కాకతీయ నగర్ కాలనీ, 14వ వార్డ్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితి వస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా కూలిన గోడను సందర్శించారు. గోడ కులడంతో సత్వరమే మున్సిపల్ అధికారులకు, డిగ్రీ కళాశాల, శిశు మందిర్ సిబ్బందికి సమాచారం అందించారు. సత్వరమే సహాయక చర్యలు చేపట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియా కోరారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ కు ఫోన్ లో వివరించగా, సోమవారం సాయంత్రం 6గంటలకు సమావేశం అయి పూర్తి స్థాయి పరిష్కారం చేయాలనీ కోరారు. ఈ సమావేశంకు డిగ్రీ, కర్షక్ కళాశాల, శిశు మందిర్, కాలనీ వాసులు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఘటన స్థలంకు చేరిన డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్స్పాల్ కిష్టయ్యను కాకతీయ నగర్ కాలనీ వాసులు, 14వ వార్డ్ ప్రజలు నిలదిశారు. డిగ్రీ కళాశాల, కర్షక్ బీ.ఈడి కళాశాల, శిశు మందిర్ తీరు పట్ల కాకతీయ నగర్ కాలనీ, 14వ వార్డ్ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తు ఆందోళన చేశారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…


