షబ్బీర్ అలీ చొరవ తో 100 కెవి ట్రాన్స్ఫార్మర్ బిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 16 (అఖండ భూమి న్యూస్)
బీబీపేట్ మండలంలోని తూజాల్ పూర్ గ్రామంలో వ్యవసాయపు బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ఎస్ ఎస్ 20 లో గల 63 కెవి ట్రాన్స్ఫార్మర్ లో ఓల్టేజి సమస్య అధికంగా ఉండడంతో షబ్బీర్ అలీ సహకారంతో అధికారంతో మాట్లాడి శనివారం క్లాసు ఫార్మర్ బిగించే విధంగా చర్యలు చేపట్టారు. మోటార్లు కాలిపోతూ రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ దృష్టికి రైతులు తీసుకెళ్లగా తక్షణమే ఎస్ ఈ శ్రావణ్ కుమార్ తో మాట్లాడి 100కెవి నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు ఇప్పించారని ట్రాన్స్ఫార్మర్ బిగింపచేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు పడుతున్న
లో ఓల్టేజి ఇబ్బందులు తెలుపగానే సత్వరమే సమస్య తీర్చిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ కిషన్, రైతులు చంద్రాగౌడ్, తలారి ప్రభాకర్, శంకర్, దేవి, రాములు,రంజిత్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…



