ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలోనే నిర్వహించాలి…

ఫ్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాలలోనే నిర్వహించాలి…

పోషన్ ట్రాకర్ యప్ లో ఫేస్ క్యాప్చర్ (ఎఫ్ ఆర్ ఎస్) విధానాన్ని రద్దు చేయాలి..

కలెక్టరేట్ ధర్నాలో కందూరి చంద్రశేఖర్..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 18 (అఖండ భూమి న్యూస్)

తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందలాది మందితో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ. ఐసిడిఎస్ ని బలపేతం చేయాలంటే ప్రీ ప్రైమరీ స్కూలు పిఎం శ్రీవిద్యను అంగన్వాడి సెంటర్ లోనే కొనసాగించాలని .విద్య బోధన బాధ్యతను అంగన్వాడి టీచర్లకు , హెల్పర్లకు ఇవ్వాలని అలాగే విద్య వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అదనంగా అంగన్వాడి టీచర్లకు ఇవ్వాలిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ తోపాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడి రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ దీని అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే పూనుకుంటుంది అని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిని వ్యతిరేకించి అంగన్వాడి సెంటర్ లోనే ప్రి ప్రైమరీ స్కూలు పీఎం శ్రీ విద్యను అమలు జరిగేటట్టు చూడాలని వారు కోరారు. ఆరు సంవత్సరాల పిల్లలలో చదువుతోపాటు ఆటలు పాటలు శారీరక ఎదుగుదల ఉండాలి కాబట్టి ఆ పద్ధతిలో పోషక ఆహారం అంగన్వాడి సెంటర్ లో సప్లై ఉంటుందనీ దీన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడి సెంటర్ల అభివృద్ధి కొరకు కృషి చెయ్యాలని అన్నారు. అంగన్వాడి సేవలకు తప్పనిసరి చేసిన ఫేస్ క్యాప్చర్ (ఎఫ్ ఆర్ ఎస్) విధానాన్ని తీసుకువచ్చి ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల గర్భిణి బాలింతల పౌష్టికాహారం తీసుకునే సందర్భంగా ఓషన్ ట్రాకర్ యాప్ లో కొత్తగా ఫేస్ క్యాప్చర్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చి అందులో అంగన్వాడీ లబ్ధిదారుల నమోదు రెండు మార్గాల రామాయకరణ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల యొక్క వన్ టైం పాస్వర్డ్ ధ్రువీకరంలో లబ్ధిదారుల యొక్క ఆధార్ నంబరు అనుసంధానించబడిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుందని అన్నారు.మీ ఓటీపీ సమస్య ద్వారా లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని గత ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన 2జీబి ర్యామ్ గల మొబైల్ తో సిగ్నల్ రాక సైటు సరిగా రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఇచ్చిన టార్గెట్ పూర్తి కాక సూపర్వైజర్లు సిడిపిఓలు మెమోలు ఇస్తామని పేరుతో ఒత్తిడి తెస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇప్పటికైనా ఫేస్ క్యాప్చర్ ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ప్రతి స్కీములను అంగన్వాడీ టీచర్ల కే అప్పజెప్పుతు పనివారాన్ని పెంచుతున్నారని అందులో భాగంగానే డిఎల్ఓ డ్యూటీలను అంగన్వాడి టీచర్లకు మినహాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికైనా అంగన్వాడి టీచర్లకు రిపోర్టింగ్ డిజిటలైజేషన్ సిస్టం అమలుకు ముందు అన్ని కేంద్రాల్లో కంప్యూటర్లు గాని లాప్టాప్ లు గాని 5జి నెట్వర్క్ తో కూడిన మొబైల్స్ ను ఇవ్వాలని వారు కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బుధవారం అరుణ్ కుమార్ నర్సింలు, అంగన్వాడి యూనియన్ జిల్లా నాయకులు బాబాయ్, లక్ష్మి, సవిత ,కవిత సునంద సిద్దేశ్వరి, సుజాత, యాదమ్మ, రా,ణి లక్ష్మి ఇందిరా అలివేలు స్వరూప సురేఖ దేవకర్ణ సుజాత పద్మ హసీనా స్రవంతి శోభ వజ్ర రాజేశ్వరి, విజయ రాజలక్ష్మి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!